Header Banner

పాక్ క్రికెటర్ ఆగ్రహం... ఓ అభిమానిపైకి దూసుకెళ్లిన వైనం! కివీస్‌తో వన్డే సిరీస్‌లో..

  Sun Apr 06, 2025 15:58        Entertainment

కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ క్లీన్ స్వీప్ ఓటమి ఎదుర్కోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, స్టేడియంలో ఆటగాళ్లు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాక్ క్రికెటర్ ఖుష్‌దిల్ షా ఏకంగా అభిమానులపై దాడికి యత్నించాడు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది. బే ఓవెల్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన కొందరు అభిమానులు ఆటగాళ్లను దూషించారు. డగౌట్‌లో ఉన్న ఖుష్‌దిల్ షాను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడారు. వారిని వారించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఖుష్‌దిల్ షా సహనం కోల్పోయి ఒక అభిమానిపైకి వెళ్ళాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సంఘటనపై పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని దూషించింది విదేశీ ప్రేక్షకులు అని వెల్లడించింది. వారి ప్రవర్తనను ఖండిస్తున్నామని పేర్కొంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు ఖుష్‌దిల్ షా వారిని వారించడానికి ప్రయత్నించాడని, దీనికి ప్రతిస్పందనగా వారు మరింత అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది. స్టేడియం అధికారులు జోక్యం చేసుకుని దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను బయటకు పంపించారని పీసీబీ పేర్కొంది. కాగా, ఆ ప్రేక్షకుల్లో కొందరు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia